S. S. Rajamouli: రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎవ్వరూ ఊహించని విధంగా

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమానుంచి రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అన్ని సంచలన విజయలు అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బాహుబలి సినిమానుంచి రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు రాజమౌళి నిర్మాతగా మారారు. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు మెడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా రంగం పై సినిమా తెరకెక్కిస్తున్నారు. గత కోదిరోజులుగా రాజమౌళి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

S. S. Rajamouli: రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎవ్వరూ ఊహించని విధంగా
Rajamouli

Updated on: Sep 19, 2023 | 12:28 PM

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. దర్శక ధీరుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమానుంచి రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అన్ని సంచలన విజయలు అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బాహుబలి సినిమానుంచి రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు రాజమౌళి నిర్మాతగా మారారు. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు మెడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా రంగం పై సినిమా తెరకెక్కిస్తున్నారు. గత కోదిరోజులుగా రాజమౌళి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా రాజమౌళి ఓ భారీ సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. మెడ్ ఇన్ ఇండియాలో ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది ఎలా ప్రపంచ కీర్తి గడించింది అన్నది చూపించనున్నారు. ఈ సినిమాకు నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెడ్ ఇన్ ఇండియాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మేరకు ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

రాజమౌళి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.