Crazy Uncles Pre Release Event: క్రేజీ అంకుల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

|

Aug 14, 2021 | 8:51 PM

బుల్లితెర పై యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రేజీ అంకుల్స్.

Crazy Uncles Pre Release Event: క్రేజీ అంకుల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Crazy Uncles
Follow us on

బుల్లితెర పై యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రేజీ అంకుల్స్. గుడ్ సినిమా బ్యానర్ పై కిరణ్ తలశిల సమర్పణలో బొడ్డు అశోక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో క్రేజీ అంకుల్స్ పాత్రలలో రవీంద్ర, సింగర్ మనో, భరణి నటిస్తున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి, రఘు, హేమా, గాయత్రి భార్గవి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా విడుదలైన టైటిల్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్య వయస్కులైన ముగ్గురు వ్యక్తులు.. 20ల్లో చేయలేకపోయిన చిలిపి పనులను మళ్లీ చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఓ అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది. వారు తమ కోరికలు నెరవేర్చుకోగలిగారా..? శ్రీముఖి వాళ్లకు ఎలా సహాయం చేయగలిగింది. అనేదే కథ. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‎ను హైదరాబాద్‏లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో లైవ్‏లో చూడవచ్చు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Also Read: Bigg Boss 5 Telugu: బోర్‏డమ్‏కి చెప్పేయండి గుడ్ బాయ్.. వచ్చేస్తున్నాడు బాస్..

Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..

Prakash Raj: ‘మా’లో కాకపుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. అసలు ఉద్దేశం అదేనా..