Sreeleela: నా కెరీర్ బిగినింగ్‌లోనే ఈ ఛాన్స్ రావడం ఆనందంగా ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Jan 08, 2023 | 4:42 PM

కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది

Sreeleela: నా కెరీర్ బిగినింగ్‌లోనే ఈ ఛాన్స్ రావడం ఆనందంగా ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sreeleela
Follow us on

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ధమాకా. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో మాస్ రాజా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు..

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చాలా అనందంగా వుంది. దర్శకుడు త్రినాథరావు,రచయిత ప్రసన్నకి అభినందనలు. శ్రీలీలకి కంగ్రాట్స్. ఇలాంటి కంగ్రాట్స్ ఇంక వింటూనే వుండాలి. భీమ్స్ ఇలాగనే ఇరగదీసేయాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారికి బిగ్ కంగ్రాట్స్. ఎక్కడా రాజీపడకుండా చేశారు. చాలా పాజిటివ్ గా వుంటారు. వారు నెక్స్ట్ లెవల్ వెళ్తున్నారు. మీడియాతో మెమెంటోలు ఇవ్వడం చాలా బావుంది. మీడియాకి కృతజ్ఞతలు. వంశీ శేఖర్ కి థాంక్స్. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రవితేజ

ఆ తర్వాత హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. రవితేజ గారు నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా కెరీర్ బిగినింగ్ లో ఆయనతో పని చేసే అవకాశం రావడం, ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. రవితేజ గారు నాలో గొప్ప ఆత్మ విశ్వాసం నింపారు. రవితేజ గారు గొప్ప స్ఫూర్తి. ధమాకాని మాస్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు