SR Kalyanamandapam: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..

|

Aug 07, 2021 | 7:52 PM

Tollywood: ఉదయం థియేటర్లలో రిలీజ్. మ్యాట్నీకి పైరసీ రెడీ. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమా దుస్థితి. మూవీకి ముహూర్తం క్లాప్ కొట్టి.. దాన్ని థియేటర్ల వరకు తీసుకెళ్లడం మామూలు...

SR Kalyanamandapam: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే SR కళ్యాణమండపం పైరసీ రెడీ..
Sr Kalyana Mandapam
Follow us on

ఉదయం థియేటర్లలో రిలీజ్. మ్యాట్నీకి పైరసీ రెడీ. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమా దుస్థితి. మూవీకి ముహూర్తం క్లాప్ కొట్టి.. దాన్ని థియేటర్ల వరకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. మధ్యలో ఎన్నో అడ్డంకులు..మరెన్నో అవాంతరాలు. ఓ సినిమా పూర్తిచేయాలంటే మరో సినిమా కనిపిస్తుందా మూవీ యూనిట్‌కి. లెక్కలేనన్ని కష్టాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత మరో తరహా కష్టాలు మొదలవుతున్నాయి. అలా మార్నింగ్ షో పూర్తయిందో లేదో ఇలా పైరసీ కాపీ బయటకు వచ్చేస్తోంది. సినిమా రిలీజ్ కోసం గోతికాడి నక్కల్లా కాచుకొని చూసే పైరసీ గ్యాంగ్‌లు పరేషాన్ చేస్తున్నాయి. క్షణాల్లో సినిమాని కాపీ కొట్టేసి ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పైరసీ సైట్లు సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని విధందా దెబ్బకొడుతున్నాయి..

చిన్న సినిమా.. పెద్ద సినిమా అన్న తేడా లేదు. స్టార్‌ హీరోల నుంచి.. చిన్న హీరోల వరకూ ఉదయాన్నే బొమ్మ పడితే చాలు…మ్యాట్నీ సమయానికల్లా పైరసీ బొమ్మ సోషల్ మీడియా, పైరసీ సైట్లలో ప్రత్యక్షం అవుతున్నాయి..ఇండ‌స్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ డూప్లికేట్‌ భూతంతో నిర్మాతల తలరాతలు తలకిందలవుతున్నాయి.ఇండస్టీ మనుగడకే పెను సవాల్‌గా మారిన ఈ డూప్లికేటు గాళ్లను వదిలించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన పరిష్కారం దొరకడం లేదు. తాజాగా SR కళ్యాణమండపం సినిమాను కూడా పైర‌సీ బెడ‌ద తాకింది. పొద్దున సినిమా విడుద‌లైతే సాయంత్రం లోపు పైర‌సీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన SR కళ్యాణమండపం సినిమాను భారీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో విడుదల చేశారు. దాదాపు 650 థియేటర్ల‌లో విడుదలైన ఈ మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఉదయం విడుదలైన ఈ సినిమా ప్రింట్ మధ్యాహ్నానికి ఆన్ లైన్‌లో దర్శనమివ్వడం దర్శక నిర్మాతలను కలవరపెడుతోంది. శ్రీధర్ గాదే SR కళ్యాణమండపం సినిమాను తెరకెక్కించాడు. పొద్దున్నే విడుదలైన సినిమాను సాయంత్రానికి పైరసీ చేసేయడం కంటే దుర్మార్గమైన పని మరోటి లేదంటున్నారు నిర్మాతలు. గతంలో కనీసం ఒక్క రోజైనా గ్యాప్ ఇచ్చి.. రెండో రోజు గానీ పైరసీ విడుదల చేసే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేద‌ని వాపోతున్నారు ప్రొడ్యూసర్లు.

బొమ్మ విడుదలైందా … పైరసీ చేశామా అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు మూవీ ఇండస్ట్రీ కుదేలైపోయింది. షూటింగ్ లు నిలిచిపోయి.. ఉపాధి కరువై నానా ఇబ్బందులు పడ్డారు. ఇక కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు ఫైనాన్షియల్ గా నరకం అనుభవించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకోవడంతో మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు నిర్మాతలు. కానీ ఆ సంతోషం లేకుండా చేస్తున్నారు డూప్లికేటుగాళ్లు..ఓ వైపు కరోనాతో థియేటర్స్ వరకు ప్రేక్షకులు వస్తారో రారో అని కంగారు పడుతున్న సమయంలో ఈ పైరసీ బాధలతో నిర్మాతల గోడు వర్ణనాతీతంగా మారిపోయింది.

Also Read: జగిత్యాల జిల్లాలో చిక్కిన అరుదైన దెయ్యం చేప.. ఇది వేరే చేపల్ని బ్రతకనియ్యదు..

 ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు