Mahesh Babu Birthday : ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ ఏడాది సంక్రాత్రికి మంచి విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ మహేశ్. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కోవిడ్ పరిస్థితులు కుదుటపడ్డ అనంతరం సినిమా షూటింగ్ షురూ కానుంది. ఇక ఇండస్ట్రీలో ఏ హీరో పుట్టినరోజు దగ్గర్లో ఉన్నా, సదరు యాక్టర్ అభిమానుల్లో జోష్ నింపడానికి మూవీ యూనిట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కొత్త సినిమాలు ప్రకటనలు, లేదంటే ప్రస్తుతం చేస్తోన్న చిత్రాలు ఫస్ట్ లుక్స్ లేదా పాటలు విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తారు. కాగా ఈ నెల 9న సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉందట. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మూవీ యూనిట్ కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. మహేశ్ బర్త్ డే పురస్కరించుకుని, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అతడు చేయబోయే మరో కొత్త చిత్రాన్నీ ప్రకటించే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్