ప్రఖ్యాత సింగర్ ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కోలుకుంటున్నారని, 90 శాతం ఐసొలేషన్ నుండి తొలిగించినట్లు చెప్పారు. ఎస్పీబీ అభిమానులకు, ఆయన శ్రేయోభిలాషులకు ఇది మంచి వార్త అని పేర్కొన్నారు. ఎంతో మంది తన తండ్రి కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఎస్పీబీ విషయంలో చాలా గొప్పగా వైద్య సేవలందిస్తున్నారని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తనకు పూర్తి నమ్మకం ఉందని ఎస్పీ చరణ్ చెప్పారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!