Sonu Supermarket : సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన సోనూ సూద్ .. బ్రెడ్డు, గుడ్డు అన్నీ హోమ్ డెలివరీనే.. చార్జీలు అదనం

Sonu Supermarket : లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్ . కష్టంలో ఉన్నవారికి నేను ఉన్నాను..

Sonu Supermarket : సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన సోనూ సూద్ .. బ్రెడ్డు, గుడ్డు అన్నీ హోమ్ డెలివరీనే.. చార్జీలు అదనం
Sonu Sood

Updated on: Jun 24, 2021 | 6:38 PM

Sonu Supermarket : లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్ . కష్టంలో ఉన్నవారికి నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా అండగా నిలబడుతున్న సోను .. అపుడప్పుడు సోషల్ మీడియాలో సరదా పోస్టులను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
గత కొన్ని నెలల క్రితం సోను సూద్ బట్టలు కుట్టే దర్జీగా మారి .. సందడి చేస్తే.. తాజాగా సోను సూపర్ మార్కెట్ ను ఓపెన్ చేశారు, అదేంటి.. సినిమాలు మానేసి.. వ్యాపారంగలోకి దిగరా అనుకోకండి.. తన సోషల్ మీడియా లో సోనూ గుడ్లు, బ్రేడ్ వంటి వస్తువులను అమ్ముతున్న ఓ వీడియో షేర్ చేశారు.. అందులో వాటి ధరలు చెబుతూ.. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని.. అయితే ఎక్కువ ఛార్జ్ వసులు చేస్తానని చెప్పారు సోను. కావాల్సిన వారు త్వరగా ఆర్డర్ ఇవ్వండి అతను వీడియో లో చేసిన సందడి నెట్టింట్లో వైరల్ అయింది.

ఇటీవల ఓ లవర్ తన గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. హెల్ప్ కావాలని అడిగిన సాయానికి.. సోనూ సరదాగా రియాక్ట్ అయ్యారు.. అపుప్డు ఇచ్చిన ట్విట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సోనూ సూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ లోనూ కీలక పాత్రను పోషిస్తున్నాడు

 

Also Read: ఉల్లి, మిరియాల రుచిని తలపించే నల్లజీలకర్రలో ఎన్నో ఔషధగుణాలు..