Tollywood: హీరోయిన్ కోసం చెరువులోకి దూకి అభిమాని సూసైడ్.. కారణం అదేనంటూ ఎమోషనల్..

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. బ్యా్క్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత క్యాన్సర్ రావడం, చికిత్స తీసుకోవడం కోలుకోవడం జరిగింది. దీంతో సినీ పరిశ్రమకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

Tollywood: హీరోయిన్ కోసం చెరువులోకి దూకి అభిమాని సూసైడ్.. కారణం అదేనంటూ ఎమోషనల్..
Heroine

Updated on: Jun 18, 2024 | 11:33 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత సోనాలికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అప్పట్లో అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. అమాయకపు చూపులు.. ఆకట్టుకునే అందంతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. బ్యా్క్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత క్యాన్సర్ రావడం, చికిత్స తీసుకోవడం కోలుకోవడం జరిగింది. దీంతో సినీ పరిశ్రమకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. తన కెరీర్ లో జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తనను కలిసేందుకు వచ్చి ఓ అభిమాని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఆ విషయం ఇప్పటికీ తనను బాధపెడుతుందని అన్నారు.

సోనాలి బింద్రే మాట్లాడుతూ..”అభిమానులు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. గతంలో ఓ అభిమాని నన్ను కలిసేందుకు వచ్చాడట. నన్ను చూడలేకపోయినందుకు చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ విషయం నన్ను చాలా బాధపెట్టింది. ఇలా హీరోహీరోయిన్లను కలవలేకపోయామని ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అది మమ్మల్ని కూడా బాధపెడుతుంది. అభిమానుల నుంచి నాకు కొన్ని ఉత్తరాలు వచ్చేవి. అందులో కొన్ని రక్తంతో రాసేవారు. దానికి చాలా బాధేసింది. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనాలి బింద్రే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.