
సోనాల్ చౌహాన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది హిమేష్ రేషమ్మియా యొక్క ఆల్బమ్ ఆప్ కా సురోర్లో తెరపై కనిపించింది.

జన్నత్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. రైన్‌బో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ భామ. ఆతర్వాత ఇక్కడ అవకాశాలు అందుకుంది.

చెలువయే నిన్ను నోడలు అనే సినిమాతో కన్నడ భాషలోనూ నటించి మెప్పించింది. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆతర్వాత పండగ చేస్కో, షేర్, డిక్టేటర్, రూలర్, ది ఘోస్ట్, ఎఫ్ 3 సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.