Sobhita Dhulipala: వేశ్య పాత్రపై తొలిసారి స్పందించిన తెలుగు హీరోయిన్.. ఎంతో గౌరవంగా ఉందంటూ..

ఏప్రిల్ 5న అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాను ఇండియాలో ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇందులో శోభితా వేశ్య పాత్రలో నటించింది. తాజాగా తన రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది.

Sobhita Dhulipala: వేశ్య పాత్రపై తొలిసారి స్పందించిన తెలుగు హీరోయిన్.. ఎంతో గౌరవంగా ఉందంటూ..
Sobhita Dhulipala

Updated on: Apr 08, 2024 | 10:18 AM

ఇన్నాళ్లు తెలుగు, హిందీలో అనేక సినిమాల్లో నటించిన హీరోయిన్ శోభితా ధూళిపాళ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవలే ఆమె మంకీ మ్యాన్ సినిమాలో కీలకపాత్రలో పోషించింది. ఈచిత్రానికి దేవ్ పాటిల్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో సికందర్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. ఏప్రిల్ 5న అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాను ఇండియాలో ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇందులో శోభితా వేశ్య పాత్రలో నటించింది. తాజాగా తన రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది.

న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ..”మంకీ మ్యాన్ సినిమాలో సీత అనే వేశ్య పాత్రలో నటించాను.. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. పైగా ఈ సినిమాలో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది. ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందని ఆశిస్తున్నాను ” అని అన్నారు. ఈ సినిమాతోనే దేవ్ పాటిల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇటీవల శోభిత గురించి దేవ్ పాటిల్ మాట్లాడుతూ ఆమె అందమైన హీరోయిన్ మాత్రమే కాకుండా గొప్ప నటి అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఇదిలా ఉంటే.. తెలుగమ్మాయి శోభిత.. హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ తెరకెక్కించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే మేజర్ సినిమాలోనూ కీలకపాత్రలో నటించింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శోభితా.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.