Tollywood: ఈ చిన్నారి సౌత్​ ఇండస్ట్రీలో అగ్రతార.. గుర్తుపట్టగలరా..?

పై ఫొటోలో.. చూడ చక్కగా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ యాక్ట్రెస్ఎ. క్కడైనా నటనకు, ప్రతిభకు అవార్డులు ఇస్తారు. కానీ.. చిరునవ్వుకు అవార్డు ఇస్తారా? అవును.. ఈ నటి నవ్వుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్ అనేది చేయలేదు. కానీ అగ్రతారగా రాణించింది. తనెవరో గుర్తుపట్టగలరా..?

Tollywood: ఈ చిన్నారి సౌత్​ ఇండస్ట్రీలో అగ్రతార.. గుర్తుపట్టగలరా..?
Heroine Childhood Photo

Updated on: Feb 09, 2024 | 4:57 PM

సినిమా హీరోయిన్ అంటే.. ఎక్స్​పోజింగ్ చేయాలిగా అంటారు. ఇందులో కొంతమేర నిజం ఉంది కానీ.. అందాల ప్రదర్శన చేయకుండానే స్టార్ హీరోయిన్స్‌గా రాణించనవి వారు కూడా ఉన్నారు. ఆ లిస్ట్‌లో సావిత్రి, సౌందర్య లాంటి వారు ముందు వరసలో ఉంటారు. ఆ లిస్టులో ఉన్న మరో హీరోయిన్ స్నేహ. సౌత్‌లో స్నేహ అంటే తెలియనివారు ఉడరు. గోపిచంద్ హీరోగా నటించిన ‘తొలివలపు’ సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టింది ఈ భామ. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తరుణ్‌ సరసన ‘ప్రియమైన నీకు’ లో నటించింది. ఈ మూవీ డిసెంట్ హిట్ అవ్వడంతో.. స్నేహకు బాగా క్రేజ్ వచ్చింది. అప్పట్నుంచి దూసుకుపోయింది స్నేహ.

ఎక్స్​పోజింగ్ చేయకుండా.. ఫ్యామిలీ, క్లాస్ పాత్రలవైపు మోగ్గు చూపింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ‘హనుమాన్ జంక్షన్’, ‘సంక్రాంతి’, ‘రాధా గోపాలం’, ‘శ్రీ రామదాసు’, ‘వెంకీ’ లాంటి చిత్రాలు స్నేహకు మంచి పేరు తెచ్చాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఏపీలోని రాజమండ్రిలో నివసించారు. ఆ తర్వాత స్నేహ పేరెంట్స్.. ముంబైలో సెటిల్ అయ్యారు. స్నేహ అక్కడే జన్మించారు. . మలయాళ దర్శకుడు పాజిల్ చొరవతో స్నేహ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఫస్ట్ మూవీ ‘ఓరు నీల పక్షి’.

చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా రాణించిన స్నేహ.. ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ ప్రసన్నను ప్రేమించి..  2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి