AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Movies: చిన్న సినిమాలే అయినా రీసౌండ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందిగా.. పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మరేపుతున్న లో బడ్జెట్ మూవీస్

బడ్జెట్‌ లెక్కలు, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, అదరిపోయే హీరో ఎలివేషన్లు లేకపోయినా.. చిన్న సినిమా పెద్ద రేంజ్‌లో హిట్ అవుతోంది. రీసెంట్ టైమ్స్‌లో అన్ని ఇండస్ట్రీలలో ఇలాంటి సంచలనాలు కనిపిస్తూనే ఉన్నాయి.

Small Movies: చిన్న సినిమాలే అయినా రీసౌండ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందిగా.. పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మరేపుతున్న లో బడ్జెట్ మూవీస్
Small Movies
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2022 | 3:28 PM

Share

స్టార్ హీరోలు కూడా ఒక్క హిట్ అంటూ వెయిట్ చేస్తున్న సమయంలో చిన్న సినిమాలు మాత్రం సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. బడ్జెట్‌ లెక్కలు, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, అదరిపోయే హీరో ఎలివేషన్లు లేకపోయినా.. చిన్న సినిమా పెద్ద రేంజ్‌లో హిట్ అవుతోంది. రీసెంట్ టైమ్స్‌లో అన్ని ఇండస్ట్రీలలో ఇలాంటి సంచలనాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే.. కన్నడ ఇండస్ట్రీ కేజీఎఫ్‌ మేనియాలో ఉన్న టైమ్‌లోనే థియేటర్లలోకి వచ్చిన సినిమా కాంతార. రిషబ్‌ శెట్టి స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాంతార.. ఫుల్‌ రన్‌లో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందన్న అంచనా ఉన్నాయి.

కోలీవుడ్‌లో కూడా ఇలాంటి సంచనలం నమోదైంది. లవ్‌ టుడే పేరుతో తెరకెక్కిన ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా.. టాప్‌ టెక్నీషియన్స్ వర్క్ చేయకపోయినా… లవ్‌ టుడే సినిమాలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మాలీవుడ్‌లోనూ చిన్న సినిమా రీసౌండ్ చేస్తోంది. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘జయ జయ జయ జయ హే’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అక్టోబర్‌లో ఎండింగ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జస్ట్ 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. ఫుల్ రన్‌లో 50 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వటం పక్కా అంటున్నారు క్రిటిక్స్‌. ఇలా అన్ని ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా కనిపిస్తుంది. ఇక మనదగ్గర సంగతి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఇప్పటికే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు చాలా సూపర్ హిట్స్ గా నిలిచాయి. పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అనుకున్నాయి.

ఇవి కూడా చదవండి
Follow Us
నకిలీ TTD ఐడీతో భక్తులను బురిడీ కొట్టిస్తున్న కి‘లేడీ’!
నకిలీ TTD ఐడీతో భక్తులను బురిడీ కొట్టిస్తున్న కి‘లేడీ’!
మిత్రమా..! ఇంకా 2 రోజులే సమయం ఉంది..ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి
మిత్రమా..! ఇంకా 2 రోజులే సమయం ఉంది..ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి
కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు
కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు
ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు
ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్