
బాహుబలి ఫేమ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం (డిసెంబర్ 20) ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. గోవాలో జరిగే సన్‌బర్న్ ఫెస్టివల్ కు నోరా వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వినయ్ సక్పాల్ (27) మద్యం సేవించి ఉన్నట్లు ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో నోరా ఫతేహికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వినయ్ సక్పాల్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను మద్యం మత్తులో కారు నడిపాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నోరా ముంబయిలో జరిగిన ఆ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.
మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారుకు కూడా ప్రమాదం జరిగింది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీరోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హీరోను మరో వాహనంలో పంపించినట్లు తెలుస్తుంది. హీరో కారుని ఢీ కొట్టిన మరో కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Actor #Sivakarthikeyan‘s car met with a small accident near Madhya Kailash in Chennai due to heavy traffic, but no one was injured.
— Suresh PRO (@SureshPRO_) December 20, 2025
Nora Fatehi involved in a scary car accident in Mumbai en route to Sunburn Festival. A drunk driver rammed her vehicle, causing a mild concussion yet she powered through for her David Guetta performance. Wishing her a swift recovery. Drive safe, everyone. #NoraFatehi… pic.twitter.com/1ptPBHWoKT
— 𝐌𝐚𝐡𝐚𝐧𝐮𝐫 𝐑𝐚𝐡𝐦𝐚𝐧 𝐁𝐚𝐝𝐡𝐨𝐧 (@Mahanur_Rahman_) December 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.