AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీకి చెక్ ఇద్దామని ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. అందరిలో నా మీద ఎలా అరిచారంటే.. టాలీవుడ్ నటుడు

మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన శివకృష్ణ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మెల్యే సీటు ఇస్తానన్నా ఎందుకు కాదన్నారు? తెలుగుదేశం పార్టీకి అప్పట్లోనే రూ. 5,000 విరాళం ఇవ్వడానికి శివకృష్ణ చేసిన సాహసం ఏంటి.?

పార్టీకి చెక్ ఇద్దామని ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. అందరిలో నా మీద ఎలా అరిచారంటే.. టాలీవుడ్ నటుడు
Ntr
Ravi Kiran
|

Updated on: May 08, 2026 | 2:14 PM

Share

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు ఎన్.టి.రామారావు. ఆయనతో పనిచేయడం అంటే అప్పట్లో నటులకు ఒక పరీక్ష లాంటిది. సీనియర్ నటుడు శివకృష్ణ అన్నగారితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ, ఆయన వ్యక్తిత్వంలోని అరుదైన కోణాలను ఆవిష్కరించారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చెప్పిన మాట విని డైలాగ్ మధ్యలో ఆపిన శివకృష్ణపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీపై నమ్మకంతో టేక్ అంటే ఎందుకు ఆపావు?” అని ప్రశ్నించినప్పుడు, శివకృష్ణ కంగారు పడినా వెంటనే తేరుకుని ఫుల్ పేజీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేశారు. ఆ ప్రతిభను చూసి అన్నగారు శివకృష్ణను తమ ‘లెక్క’లో వేసుకున్నారట. అంటే ఆయన నటనపై అన్నగారికి ఒక నమ్మకం ఏర్పడింది.

తెలుగుదేశం పార్టీని ప్రకటించే ముందు రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ శివకృష్ణను పిలిపించి మెదక్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరారు. “మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తులు మాకు కావాలి” అని అన్నగారు ఆహ్వానించగా.. అప్పుడప్పుడే కెరీర్‌లో దూసుకుపోతున్న శివకృష్ణ, “సార్ మీ భక్తుడినై సినిమాల్లోకి వచ్చాను, ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే బాగుండదు.. వంద సినిమాలు పూర్తి చేశాక వస్తాను” అని సున్నితంగా తిరస్కరించారు. దానికి అన్నగారు నవ్వి అంగీకరించారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంత నిక్కచ్చిగా ఉండేవారో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. పార్టీ పెట్టిన కొత్తలో శివకృష్ణ తన వంతుగా రూ. 5,000 చెక్ పట్టుకుని తెల్లవారుజామున అన్నగారి ఇంటికి వెళ్లారు. అయితే డబ్బు తీసుకోవడానికి అన్నగారు నిరాకరిస్తూ.. “సినిమా వాళ్లని మేము దగ్గరికి రానివ్వం, నీ డబ్బు మాకొద్దు” అని కఠినంగా చెప్పారు. తన భక్తిని తిరస్కరించడంతో మనస్తాపం చెందిన శివకృష్ణ, “మీరు కాదంటే గేటు బయటే ఆత్మహత్య చేసుకుంటాను” అని భావోద్వేగానికి గురయ్యారు. శివకృష్ణ ప్రేమను చూసి చలించిన అన్నగారు, చివరకు ఆ చెక్‌ను స్వీకరించమని తన అనుచరుడు ఉపేంద్రకు సూచించారు. అలా తెలుగుదేశం పార్టీకి అందిన మొదటి డొనేషన్ శివకృష్ణ ఇవ్వడం విశేషం.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!