డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం (Sita Ramam)సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రావడమే కాకుండా.. వసూళ్లు పరంగానే దూసుకుపోయింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ దక్షిణాది ప్రేక్షకుల మనసులను తాకింది. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే.. ఇటీవలే హిందీలోనూ విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ కంటెంట్ మాత్రమే కాకుండా.. సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖరన్ అందించిన సంగీతం శ్రోతలను కట్టిపడేసింది. మహానటి సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈ మూవీతో మరోసారి ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.
ఇక ఈ మూవీ విడుదలైన నెల రోజులు పూర్తైన సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సీతారామం నుంచి డిలిటెడ్ సీన్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సీతామహాలక్ష్మీ కోసం వెతుకుతూ వెళ్లే క్రమంలో రష్మిక క్యాబ్ లో ఓ ప్యాలెస్ వద్దకు వెళ్తుంది. హడావిడిలో తన బ్యాగ్‌ను క్యాబ్ లోనే మర్చిపోయి లోపలికి వెళ్తుంది. కాసేపటికి బ్యాగ్ కోసం వెనక్కి వచ్చి డ్రైవర్ తో ఇంకా ఇక్కడే ఉన్నావా. పర్లేదు.. ఇండియాలో నీలాంటి వాళ్లున్నారన్న మాట అంటుంది. దానికి క్యాబ్ డ్రైవర్.. ఇండియాలో అందరూ నాలానే ఉంటారు. మీ బ్యాగ్ తీసుకపోయి నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇంత అద్భుతమైన డైలాగ్ ఉన్న సీన్ ఎందుకు తీసివేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో రష్మిక.. తరుణ్ భాస్కర్.. సుమంత్ కీలకపాత్రలలో నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.