ఒక పరీ వీడియో విషయంలో శ్రావణ భార్గవి(Sravana Bhargavi)తగ్గడంలేదు. తనపై వస్తున్న విమర్శలకు అసలేమాత్రం జంకడంలేదు. భక్తుల దగ్గర నుంచి.. అన్నమయ్య అనుయాయుల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. ఇది నిన్నమొన్నటి వరకు. కాని తాజాగా ఈ సింగర్ రియాక్టయ్యారు. తీవ్ర వివాదాస్పదం అయిన తన ఒక పరి వీడియోను యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి తొలిగిస్తున్నా అని అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేస్తూనే.. మరో కండీషన్‌తో శ్రీవారి భక్తులకు చిర్రెత్తుకొచ్చేలా చేశారు. వారి మాటలకు వెనక్కి తగ్గేదేంటి అనేలా.. కేవలం వీడియోకున్న ఆడియోను మాత్రమే మార్చారు శ్రావణ భార్గవి. అంటే ఒక పరి శ్లోకం స్థానంలో.. మరో మ్యూజిక్ వచ్చేలా చేశారు అంతే! కాని వీడియోను మాత్రం డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు.
ఇక సింగర్ గా పాపులర్ అయిన శ్రావణ భార్గవి.. రీసెంట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ పెంచారు. లైవ్ వీడియోలు, వ్లోగ్స్ చేస్తూ.. యూట్యూబ్‌లో పైకం కమాయించే ప్రయత్నం చేస్తున్నారు. డెయిలీ అప్డేట్స్ తో తన సోషల్ మీడియా హ్యాండలింగ్స్ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. ఇటీవల శరవణ భార్గవి తన భర్త సింగర్ హేమచంద్ర తో విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో తాము విడిపోవడంలేదని క్లారిటీ ఇచ్చారు ఈ జంట. ఇక ఇప్పుడు ఇలా వీడియో తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మరి ఈ వివాదం ఇప్పటికైనా ముగుస్తుందో లేదో చూడాలి.