P.Susheela: ‘బాలు వెళ్లిపోయాక చిత్ర పరిశ్రమ చీకటైపోయింది’.. గాన కోకిల సుశీలమ్మ పంచుకున్న విషయాలు..

|

Feb 10, 2023 | 9:47 AM

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్.. ఆనాటి విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే దివంగత సింగర్ బాలసుబ్రమణ్యం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

P.Susheela: బాలు వెళ్లిపోయాక చిత్ర పరిశ్రమ చీకటైపోయింది.. గాన కోకిల సుశీలమ్మ పంచుకున్న విషయాలు..
P.susheela, Sp Balu
Follow us on

కోయిలను మరిపించిన సుమధుర వాణి ఆమె సొంతం. ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం. ఆమె గళం ఉరికే ఝరి. అది యుగళగీతమైనా.. భక్తిగీతమైనా .. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్న గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకు ఎంతో ఆత్మీయత… ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్.. ఆనాటి విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే దివంగత సింగర్ బాలసుబ్రమణ్యం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“బాలు పాటలు వింటుంటే ఇంకో పది సంవత్సరాలు ఉండకూడదా ? అని దేవుడితో పోట్లాడుతుంటాను. ఇండస్ట్రీకి చాలా లాస్ అయ్యింది బాలు వెళ్లిపోవడం. మళ్లీ అలాంటి గాయకుడు రావాలంటే చాలా కష్టం. మంచి వాళ్లు నాలుగు రోజులు ఉండాలి. ఇంతవరకు ఎన్నో వేల పాటలు పాడాను. పాడటం ఎప్పుడూ అలసటగా అనిపించేది కాలేదు. నేను.. బాలు కలిసి ఒక రికార్డింగ్ థియేటర్ నుంచి మరో రికార్డింగ్ థియేటర్ కు పరుగులు పెడుతూ ఉండేవాళ్లం. మహాత్ముడు బాలు ఎక్కడ ఉన్నాడో గానీ.. ఆయన వెళ్లిపోయిన తర్వాత చిత్రపరిశ్రమ చీకటైపోయింది. ఆది ఆయన ప్రత్యేకత” అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఘంటసాల గారు మా ఊళ్లోనే చదువుకున్నారు. కానీ నేను ఆయనను అక్కడ చూడలేదు. మద్రాసు వచ్చిన తర్వాతనే ఏవీఎమ్ స్టూడియోలో చూశాను. ఆయనతో కలిసి భూకైలాస్ సినిమా కోసం అనుకుంటాను ఫస్ట్ సాంగ్ పాడాను. ఓవైపున పులిలా ఒక మైకు ముందు ఘంటసాల గారు. మరో మైకు ముందు నేను. ఆ రోజులను తలచుకుంటే ఎలా పాడానా అనిపిస్తుంది ” అంటూ చెప్పుకొచ్చారు.