
సింగర్ కౌసల్య .. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే.. అద్భుతమైన తన గాత్రంతో ప్రేక్షకులను అలరించింది ఈమె. దివంగత సంగీత దర్శకుడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో వందల పాటలు పాడింది కౌసల్య. మనసుకు హత్తుకునే అద్భుతమైన పాటలను ఆలపించింది కౌశల్య. చక్రి మరణం తర్వాత కౌసల్య పాటలు తగ్గించారు. సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కౌసల్య వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. తన భర్త చాలా చిత్రహింసలు పెట్టేవాడిని తెలిపింది కౌసల్య.
ప్రొఫెషనల్ లైఫ్ సాగినంత సాఫీగా పర్సనల్ లైఫ్ సాగలేదు అంటోంది కౌసల్య. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో కొడుకును పెంచే బాధ్యత తానే తీసుకున్నానని అన్నారు. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించారు. అది కేవలం నా కొడుకు కోసమే అన్నారు.
అప్పుడు నా కొడుకు చిన్న వాడు అండ్ భరించారు. ఇప్పుడు భర్త తోడు లేకుండా ఉంటున్నా.. నా కొడుకును చక్కగా పెంచాను. ఇప్పుడు నా కొడుకు నన్ను రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు. జీవితంలో తోడు అవసరం అంటున్నాడు నా కొడుకు ‘ఒంటరిగా ఉండొద్దు, నిన్ను బాగా చూసుకునే వాడు రావాలి’ అని అంటున్నాడు నా కొడుకు అని తెలిపింది కౌసల్య.