Geeta Madhuri: గీతా మాధురి భర్తకు గాయం.. కదల్లేని స్థితిలో ఉన్నా డబ్బింగ్‌ వర్క్ చేస్తోన్న నందు

కాలికి గాయమైనా,కదల్లేని స్థితిలో ఉన్నా కూడా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకి వచ్చాడు నందు. అక్కడ దిగిన ఫొటోనే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ ఫొటోను చూస్తే అతని కాలికి పట్టి కట్టినట్టు స్పష్టమవుతోంది.

Geeta Madhuri: గీతా మాధురి భర్తకు గాయం..  కదల్లేని స్థితిలో ఉన్నా డబ్బింగ్‌ వర్క్ చేస్తోన్న నందు
Geeta Madhuri, Nandu
Follow us

|

Updated on: Feb 17, 2023 | 1:02 PM

టాలీవుడ్ స్టార్‌ సింగర్ గీతా మాధురి భర్త, ప్రముఖ నటుడు నందు తీవ్రంగా గాయపడ్డాడు. అతనే ఈ విషయాన్ని తెలిసేలా ఓ సోషల్‌ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. కాలికి గాయమైనా,కదల్లేని స్థితిలో ఉన్నా కూడా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకి వచ్చాడు నందు. అక్కడ దిగిన ఫొటోనే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ ఫొటోను చూస్తే అతని కాలికి పట్టి కట్టినట్టు స్పష్టమవుతోంది. అయితే దెబ్బ ఎలా తగిలిందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరలవుతోంది. అతను త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా తెలుగమ్మాయి అంజలితో కలిసి ఫొటో అనే ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు నందు. 100 పర్సంట్ లవ్, ఆటోనగర్ సూర్య, పాఠశాల, రభస, శౌర్య, పెళ్లి చూపులు, జయ జానకి నాయక, రాజుగారి గది2, సమ్మోహనం తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా సవారీ, బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌లో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే యాక్టింగ్‌ పరంగా నందుకు ప్రశంసలు లభించినప్పటికీ ఈ సినిమాలు పెద్దగా క్లిక్‌ అవ్వలేదు. అయితే హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టు, విలన్‌గానూ వరుస సినిమాలు టేకప్‌ చేస్తున్నాడు నందు. ప్రస్తుతం అతను పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు, ఎస్ఎస్ఎంబీ 28, ఆర్‌సీ 15, ఈజే టిల్లు 2, ధాస్ కీ ధమ్కీ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే క్రికెట్ కామెంటరీలతోనూ ఫుల్‌ బిజిబిజీగా గడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @that_actor_nandu

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..