
సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ ను అభిమానించే వారు చాలా మంది ఉంటారు. హీరోయిన్స్ కు కూడా హీరోలకు సమానంగా క్రేజ్, ఫాన్ బేస్ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ను చూసేందుకు, కలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. సినిమా ఈవెంట్ నిర్వహిస్తే చాలు వేలమంది అభిమానులు అక్కడికి చేరుకుంటుంటారు. అయితే కొన్ని సార్లు అభిమానుల వల్ల సెలబ్రెటీలు ఇబ్బందిపడ్డ సన్నివేశాలు చాలా ఉన్నాయి. కొందరు అభిమానులు హీరోలు, హీరోయిన్స్ పట్ల అత్యుత్సహం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో కొందరు అభిమానులు పిచ్చి చేష్టలు చేస్తుంటారు. హీరోయిన్స్ ను చూడాలని, వారిని తాకాలని ఎగబడుతూ ఉంటారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఊహించని షాక్ తగిలింది.
నిధి అగర్వాల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ దగ్గర ఉంచి సాంగ్స్, టీజర్స్ సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా రాజా సాబ్ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని లులూ మాల్ లో రాజా సాబ్ సెకండ్ సాంగ్ రిలీజ్ కు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యింది. కాగా నిధి అగర్వాల్ ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.
ఈవెంట్ అయిపోయిన తర్వాత నిధిని దగ్గర నుంచి చూడాలని అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా మీదపడటంతో నిధి వణికిపోయింది. ఆమెను అభిమానులనుంచి తప్పించి కారులోకి ఎక్కించడానికి అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ కు చాలా కష్టం అయ్యింది. కొందరు అభిమానులు అత్యుత్సహం చూపించి ఆమెను తాకాలని మీదపడ్డారు. దాంతో నిధి అగర్వాల్ షాక్ అయ్యింది. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.” వీళ్లు మగాళ్లు కాదు, జంతువులు. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లని వేరే గ్రహానికి పంపాలంటూ మండిపడ్డారు సింగర్ చిన్మయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.