AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle : సింగర్ ఆశా భోస్లేకు గుండె పోటు.. ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రముఖ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స కొనసాగుతోంది.

Asha Bhosle : సింగర్ ఆశా భోస్లేకు గుండె పోటు.. ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి ఎలా ఉందంటే..
Singer Asha Bhosle
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2026 | 6:38 AM

Share

ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రికి ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆశా భోస్లే 80 ఏళ్లకు పైగా తన గాత్రంతో భారతీయ చిత్రసీమను మంత్రముగ్ధులను చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. ఇప్పటివరకు వివిధ భారతీయ భాషలలో వేలాది పాటలు పాడి తనదైన ముద్ర వేశారు. ఆశా భోస్లే 2 జాతీయ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు పాడిన ఆశా భోంస్లే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఆమె హేరామ్ చిత్రంలోని ‘నీ పార్థ పార్వైక్కు ఒరు నాట్రా’, ‘అలైపాయుడే’ చిత్రంలోని ‘సెప్టెంబర్ మంత్’, ‘చంద్రముఖి’ చిత్రంలోని ‘కొంచ నేరం కొంచ నేరం’తో సహా పలు హిట్ పాటలను పాడారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం ఆశా భోస్లే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమెను ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. పరిస్థితి తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “మా అమ్మమ్మ ఆశా భోస్లే తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. అంతా త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాము. మేము మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాము.” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us