Arijit Singh: సింగర్‌గా ఫుల్ డిమాండ్.. 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్.. కారణమేమిటంటే?

ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్లే బ్యాక్ సింగింగ్ కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. హిందీ, తెలుగుతో పాటు ఎన్నో పాటలకు ప్రాణం పోసిన అర్జిత్ సింగ్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Arijit Singh: సింగర్‌గా ఫుల్ డిమాండ్.. 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్.. కారణమేమిటంటే?
Singer Arijit Singh

Updated on: Jan 28, 2026 | 6:10 AM

తన తీయటి గొంతుతో ఎన్నో వందలాది పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ప్లే బ్యాక్ సింగింగ్ కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు అర్జిత్ సింగ్. ప్రస్తుతం ఈ సింగర్ క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్జిత్ సింగ్ ప్రకటనతో ఆయన అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. అర్జిత్ సింగ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించార. “హాయ్.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా నాకు ఇంతటి ప్రేమని అందించినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను ప్లే బ్యాక్‌ సింగర్‌గా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం లేదని ప్రకటిస్తున్నాను. ఇకపై నేను దీన్ని ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. దేవుడు నా పట్ల చాలా దయతో ఉన్నాడు. భవిష్యత్‌లో ఒక చిన్న కళాకారుడిగా మరింత నేర్చుకుని నా సొంతంగా మరిన్ని పనులు చేస్తాను. మీ అందరి సపోర్ట్ కి మరోసారి ధన్యవాదాలు. నేను ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్న పనులు(పాటలు) పూర్తి చేయాల్సి ఉంది. వాటిని కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఈ ఏడాది మీరు కొన్ని పాటలను నా నుంచి చూడొచ్చు. అదే సమయంలో నేను సంగీతం చేయడం ఆపనని స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అని పోస్ట్ లో రాసుకొచ్చారు అర్జిత్ సింగ్.

ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అర్జిత్ సింగ్ హిందీతో పాటు తెలుగు, బెంగాలీ, తమిళం భాషల్లోని పాటలకు కూడా తన గాత్రాన్ని అందించాడు. తెలుగు పాటల విషయానికి వస్తే.. కేడీ, స్వామి రారా, ఉయ్యాల జంపాల, నువ్వే నా బంగారం, నీ జతగా నేనుండాలి, రౌడీ ఫెలో, దోచెయ్, భలే మంచి రోజు, కేశవ, హుషారు, ఓం భీమ్ బుష్ తదితర సినిమాల్లోని పాటకు వర్క్ చేశారు అర్జిత్ సింగ్.

ఇవి కూడా చదవండి

ఇటీవలే అరిజిత్ సింగ్ కొత్త పాట విడుదలైంది. సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ లో మాతృభూమి అనే సాంగ్ ను ఆయన ఆలపించారు. ఈ సినిమాకు హిమేష్ రేషమ్మియా సంగీతం అందించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.