Singeetam Srinivasa Rao : సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు సింగీతం. సెప్టెంబర్ 9న కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించిన ఆయన, ఈ నెల 22న హోమ్ ఐసొలేషన్ పూర్తవుతుందని వెల్లడించారు. చిన్నపాటి ఇన్‌ఫెక్షన్ ఉందని వైద్యులు వెల్లడించారని, ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నట్లు తెలిపారు. తానెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటానని పేర్కొన్న సింగీతం, హోమ్ ఐసోలేషన్‌లో ఉంటే హాస్టల్ రోజులు గుర్తుకొస్తున్నాయని చమత్కరించారు. ”నేను ఇప్పుడేంటి.. గత అరవై, డెభ్బై ఏళ్లుగా పాజిటివ్‌నే…`అంటూ సరాదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన అభిమానులు, సన్నిహితులు, మిత్రుల కంగారు పడొద్దంటూ.. తన ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉందని వివరించారు. కోవిడ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కాగా 88 ఏళ్ల సింగీతం, ఈ నెల 21న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, త్వరలోనే ఈ సీనియర్ డైరెక్టర్ సమంత ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత
చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?
ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !