
టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ హీరోయిన్గా కనిపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో నటిగా ప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత అఆ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. దాదాపు పదేళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించిన అనుపమ.. ఇప్పుడు రూటు మార్చింది. ఇన్నాళ్లు ట్రెడిషన్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ షోకు తెర తీసింది. రౌడీ బాయ్స్ సినిమాతో గ్లామర్ హద్దులు చేరిపేసి అభిమానులకు షాకిచ్చింది. ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ లో నటించి ఫ్యాన్స్ గుండెలు ముక్కలు చేసింది. ఇక ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమాలో మరింత బోల్డ్ గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ లో అనుపమను చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. తమ ఆరాధ్య దేవత ఇలా మారిందేంటీ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్లామర్ హీరోయిన్ గా కనిపించడానికి గల కారణాన్ని ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో బయటపెట్టింది ఈ మలయాళీ బ్యూటీ. ఎప్పుడూ బిర్యానీ కాకుండా తనకు పులిహోరా కూడా తినాలని ఉందని.. అందుకే రోటిన్ రోల్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది.
ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ఈ మూవీపై బజ్ క్రియేట్ చేశారు. దీంతో చిత్రానికి కచ్చితంగా ‘A’ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా టిల్లు స్కేర్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉంటుందని అనుకున్న వారు.. ఇప్పుడు ఫ్యామిలీ తో కలిసి ఈ సినిమా చూడొచ్చని తెలిసిపోయింది. దీంతో ఇన్నాళ్లు గ్లామర్ బౌండరీస్ క్రాస్ చేసిందని భావిస్తున్న అనుపమ ఫ్యాన్స్.. ఇప్పుడు యూ/ఏ సర్టిఫికేట్ రావడంతో ఖుషీ అవుతున్నారు.
గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నారు. రామ్ మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.
#TilluSquare is certified with 𝐔/𝐀 ❤️🔥
Tillanna is ready to BLAST the screens with DOUBLE the FUN & ENTERTAINMENT! 😎🤘
Worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo… pic.twitter.com/kQpuu0AlFI
— Sithara Entertainments (@SitharaEnts) March 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.