Tillu Square Collections : బాక్సాఫీస్‏ను అల్లాడిస్తోన్న టిల్లు.. వారం రోజుల్లోనే రికార్డ్స్ మోత.. కలెక్షన్స్ ఎంతంటే..

|

Apr 04, 2024 | 5:30 PM

డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు తొలి ఆటకే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక అదే రోజు నిర్వహించిన సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ... ఈ మూవీ కచ్చితంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. ఇక అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు టిల్లు ఖాతాలో సులువుగా వంద కోట్లు వచ్చేస్తున్నాయి.

Tillu Square Collections : బాక్సాఫీస్‏ను అల్లాడిస్తోన్న టిల్లు.. వారం రోజుల్లోనే రికార్డ్స్ మోత.. కలెక్షన్స్ ఎంతంటే..
Tillu Square
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని సినిమా.. ఆ తర్వాత మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ను అల్లాడిస్తుంది. మార్చి 29న భారీ హైప్ మధ్య విడుదలైన ఈ మూవీ అడియన్స్ అంచనాలను మించి దూసుకుపోతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు తొలి ఆటకే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక అదే రోజు నిర్వహించిన సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… ఈ మూవీ కచ్చితంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. ఇక అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు టిల్లు ఖాతాలో సులువుగా వంద కోట్లు వచ్చేస్తున్నాయి. వారం రోజులు పూర్తి కాకుండానే వంద కోట్లకు చేరువలోకి వచ్చేశాడు టిల్లు.

ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 23 కోట్లు రాబట్టిన చిత్రం.. ఐదు రోజుల్లో రూ. 85 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఆరు రోజుల్లోనే రూ. 91 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ ను అల్లాడిస్తున్నాడు టిల్లు. ఆరు రోజుల కలెక్షన్స్ వివరాలను మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇక మరో రెండు రోజుల్లో ఈజీగా రూ. 100 కోట్ల మార్క్ దాటటం ఖాయం. వారం రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం అంత సులువైన విషయం కాదు. డీజే టిల్లుతో సంచలనం సృష్టించిన సిద్ధూ.. టిల్లు స్క్వేర్ సినిమాతో తన నట విశ్వరూపం చూపించాడు.

ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్క్వేర్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక రేపు (ఏప్రిల్ 5న) విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో అటు టిల్లుగాడి ఖాతాలో కలెక్షన్స్ మాత్రం తగ్గేలా లేదంటున్నారు ఫ్యాన్స్. మరో రెండు వారాల దాకా టిల్లు ప్రభంజనం కొనసాగేలా ఉందని అంటున్నారు. ఇక ఈ వీకెండ్ లో టిల్లు కలెక్షన్స్ మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్ కూడా తెరకెక్కించనున్నట్లు సిద్దూ గతంలోనే వెల్లడించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.