సిద్ధూ జొన్నలగడ్డ.. గత రెండేళ్లకు ముందు ఈపేరు ఎవరికీ తెలియదు. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడు.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. నెమ్మదిగా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరపై అలరించినా.. ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో సిద్ధూకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2022లో సిద్ధూ నటించిన డీజే టిల్లు అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో టిల్లు పాత్రలో సిద్ధూ మేనరిజం.. డైలాగ్ డెలివరీ యూత్‌కు తెగ కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోని.. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు మరోసారి టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుండు సిద్దూ. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. టిల్లు స్వ్కేర్ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్రబృందానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతరాత్రి తారక్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సిద్ధూ చేసిన పోస్ట్ అభిమానులకు పలు సందేహాలు కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ తో క్లోజ్ గా దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. దేవరలో టిల్లు ఉన్నాడా ?ఏంటీ?.. నిజంగానే దేవరలో టిల్లు కనిపిస్తే ఎలాంటి రోల్ ఎంపిక చేసుకుంటాడు ?.. బిగ్ సర్ ప్రైజ్ అంటే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తారక్ తో టిల్లు, విశ్వక్ కలిసి దిగిన ఫోటోస్ వైరలవుతుండగా.. వీరి ముగ్గురితో మల్టీ స్టారర్ వస్తే బాగుండు అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తారక్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.