Siddharth: మరోసారి ప్రేమలో పడిన సిద్ధార్థ్‌, అదితి రావు? నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు, వీడియోలు..

Siddharth- Aditi Rao Hydari: ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), అందాలతార (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై అటు సిద్ధార్థ్‌ కానీ, అదితీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా వీరిద్దరికి..

Siddharth: మరోసారి ప్రేమలో పడిన సిద్ధార్థ్‌, అదితి రావు? నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు, వీడియోలు..
Siddharth Aditi Rao Hydari

Updated on: Jul 20, 2022 | 7:39 PM

Siddharth- Aditi Rao Hydari: ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), అందాలతార (Aditi Rao Hydari) ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై అటు సిద్ధార్థ్‌ కానీ, అదితీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా వీరిద్దరికి ఇప్పటికే పెళ్లై తమ భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఈ జోడీ ముంబయి వీధుల్లో దర్శనమిచ్చింది. సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఈ జంట సందడి చేసింది. అయితే రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తోన్న వీరి ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించారు. అయితే ఇది గమనించిన సిద్ధార్థ్‌ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను ఇక్కడి వాడిని కాదు. కావాలంటే ఇక్కడివారి ఫొటోలు తీసుకోండి. ఇప్పుడు సున్నితంగా చెబుతున్నా. తర్వాత వేరేలా ఉంటుంది’ అంటూ ఫొటోగ్రాపర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సిద్ధార్థ్‌. కాగా వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన మహా సముద్రం సినిమాలో జంటగా నటించారు సిద్ధార్థ్‌- అదితి. సుమారు మూడేళ్ల తర్వాత సిద్ధార్థ్‌ సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించడం విశేషం. అజయ్‌భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్‌ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే సిద్ధార్థ్‌, అదితి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us