
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన సవసరం లేదు. చాలా కాలం సరైన హిట్ లేక సతమతం అయిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా 1000కోట్లవరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు షారుక్ ఖాన్. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. పఠాన్ సినిమా తర్వాత జవాన్ సినిమాతో మరోసాలీడ్ హిట్ అందుకున్నారు షారుక్. అలాగే డంకి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు షారుఖ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ పఠాన్ ‘ సినిమాకు సీక్వెల్‌ను తీయనున్నారని టాక్ వినిపిస్తుంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను రూపొందించనున్నారు.
‘వార్’, ‘పఠాన్’ చిత్రాలతో సిద్ధార్థ్ ఆనంద్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల విడుదలైన ఆయన ‘ఫైటర్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా ఓ మోస్తరుగా బిజినెస్ చేసింది. అయితే ఇప్పుడు పఠాన్ సినిమాకు సిద్ధార్థ్ దర్శకత్వం వహించడం లేదట. సిద్ధార్థ్ ఆనంద్ స్థానంలో కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్నారట నిర్మాతలు.
బాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో సిద్ధార్థ్ ఆనంద్ ఒకరు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఇప్పుడు పఠాన్ సినిమా సీక్వెల్ రానుందని అంటున్నారు. మొదటి పార్ట్ కు మించి ఈ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు మూవీ మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.