శ్రద్దా సూపర్ అంటోన్న సుజీత్

|

Jun 28, 2019 | 4:10 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ ఇండియన్ స్టార్ హీరో అయిపోయాడు.. దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూసింది.. దర్శకదిగ్గజం రాజమౌళి తో సినిమా చేసిన ప్రభాస్ తో పెద్ద పెద్ద దర్శకులు, అగ్రనిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూలు కట్టారు.. రెమ్యునరేషన్ కూడా భారీ ఆఫర్ ను అందుకున్నాడు.. ఐతే ప్రభాస్ అనుభవాన్ని కాదని.. ఒక్క […]

శ్రద్దా సూపర్ అంటోన్న సుజీత్
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ ఇండియన్ స్టార్ హీరో అయిపోయాడు.. దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూసింది.. దర్శకదిగ్గజం రాజమౌళి తో సినిమా చేసిన ప్రభాస్ తో పెద్ద పెద్ద దర్శకులు, అగ్రనిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూలు కట్టారు.. రెమ్యునరేషన్ కూడా భారీ ఆఫర్ ను అందుకున్నాడు.. ఐతే ప్రభాస్ అనుభవాన్ని కాదని.. ఒక్క సినిమా చేసిన దర్శకుడు సుజిత్ ఓకే చెప్పాడు.. సాహో సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే మేకింగ్ వీడియోతో మూవీలో ఏదో ఉంది అనిపించిన సాహో … టీజర్‌తో హాలీవుడ్ మేకింగ్‌ను గుర్తు చేసింది.

అయితే ఈ సినిమా దర్శకుడు సుజీత్.. హీరోయిన్ శ్రద్దా కపూర్‌కు పుల్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. సాహోలో ప్రభాస్ పక్కన ఆమెను తప్ప మరో హీరోయిన్‌ను ఊహించలేమని ఘంటాపథంగా చెప్తున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో శ్రద్దా డూప్ లేకుండా చేసిందని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. డైరక్టర్స్‌తో ప్రశంసలు అందుకోవడం శ్రద్దాకు కొత్తేం కాదు. చేసిన ప్రతి సినిమాలోనూ తన మార్క్ యాక్టింగ్‌తో మేకర్స్ కాంప్లిమెంట్స్ అందుకోవడంలో ఆమె ఎక్స్‌పర్ట్ అని చెప్పుకోవాలి.