Bigg Boss Telugu OTT : వాయమ్మో.. మరోసారి బిగ్ బాస్‌లోకి శోభాశెట్టి.. ఇవిగో డీటేల్స్

బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ 2లో శోభా శెట్టి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. శోభా శెట్టి తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గోన్న సంగతి తెలిసిందే. తన టాస్క్‌లతో అలరించినా.. గ్రూప్ గేమ్, అరుపులు, ఓవరాక్షన్‌తో చాలామందికి విసుగు తెప్పించింది. ఒకానొక సమయంలో ఆమెను బయటకు పంపడాన్నే టాస్కుగా పెట్టుకున్నారు కొందరు.

Bigg Boss Telugu OTT : వాయమ్మో.. మరోసారి బిగ్ బాస్‌లోకి శోభాశెట్టి.. ఇవిగో డీటేల్స్
Shoba Shetty

Updated on: Jan 04, 2024 | 5:45 PM

బిగ్ బాస్ సీజన్ 7 దుమ్ము రేపింది. టాప్ రేటింగ్‌తో అదరగొట్టింది. ఉల్టా పుల్టా సీజన్‌ను జనాలు బాగా ఆదరించారు. ఫినాలే రోజు జరిగిన న్యూసెన్స్ తప్పితే సీజన్ అంతా బ్లాక్ బాస్టర్. రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. 2, 3 స్థానాల్లో అమర్‌దీప్, శివాజీ నిలిచారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అవ్వడంతో.. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ త్వరలో షురూ కానుందని హాట్ స్టార్‌ ఓటీటీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటీటీ ఫస్ట్ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ కేవలం హాట్ స్టార్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. ఇక బిగ్ బాస్ తెలుగు 7 కూడా మంచిగా క్లిక్ అవ్వడంతో.. ఇప్పుడు ఓటీటీ రెండో సీజన్‌కు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారట.  ఓటీటీ సీజన్‌కు నాగార్జునే హోస్ట్ చేయనున్నారని తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేశారట.

అన్‌లిమిటెడ్ ఫన్‌తో సీజన్ 7లో అందర్నీ ఎంటర్టైన్ చేసిన భోలే షావలి ఓటీటీ సీజన్‌ 2లో కూడా సందడి చేయబోతున్నట్లు తెలిసింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం… ఈ సీజన్‌లో శోభా శెట్టి కూడా ఎంట్రీ ఇవ్వనుందట. విపరీతమైన నెగిటివిటి మూట గట్టుకున్న తన దత్త పుత్రికకు మరో చాన్స్ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. ఈ న్యూస్ ఎంతమేర నిజమన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

సోషల్ మీడిలో పాపులర్ అయిన బర్రెలక్క, హీరోయిన్ రిచా పనయ్‌,  మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి సింగింగ్ షోలో సత్తా చాటిన సింగర్ పార్వతి.. నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, నటి సోనియా దీప్తి  ఓటీటీ సీజన్ 2లో అలరించబోతున్నారని తెలిసింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.