Vishnu Manchu: మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ఆ స్టార్ హీరోలు కూడా నటించనున్నారా.!!

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో మొదలు పెట్టాడు విష్ణు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే పార్వతి దేవిగా నయనతార నటించనుందట.

Vishnu Manchu: మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ఆ స్టార్ హీరోలు కూడా నటించనున్నారా.!!
Kannappa

Updated on: Oct 14, 2023 | 8:13 AM

మంచి విష్ణు పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భక్త కన్నప్ప కథను సినిమా గా తెరకెక్కిస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో మొదలు పెట్టాడు విష్ణు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే పార్వతి దేవిగా నయనతార నటించనుందట. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా చేశారట మంచు విష్ణు. అలాగే మరికొంతమంది స్టార్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీ శివన్నగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు శివరాజ్ కుమార్. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో క్యామియో చేశారు. శివన్న ఎంట్రీతో జైలర్ సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లిందని ప్రేక్షకులు అంటున్నారు.

ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో శివరాజ్ కుమార్ నటిస్తునారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత చిత్ర బృందం నుంచే అధికారికంగా సమాచారం వచ్చింది. అలాగే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇటీవలే మోహన్ లాల్ కూడా జైలర్ సినిమాలో నటించిన విషయాంక్ తెలిసిందే. ఇప్పుడు కన్నప్ప సినిమాలోనూ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కన్నప్ప సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుపనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి