Shiva Nirvana : అందమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ… ఆ హీరో కోసమేనా..

టాలీవుడ్‌లో అందమైన ప్రేమకథలకు ఎప్పుడు మంచి ఆదరణే దక్కుతుంది. ఇటీవల వచ్చిన  వైష్ణవ్ తేజ్ ఉప్పెన,  రీసెంట్‌గా నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాల విజయాలే అందుకు నిదర్శనం..

Shiva Nirvana : అందమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్న  శివ నిర్వాణ... ఆ హీరో కోసమేనా..
Shiva

Updated on: Sep 25, 2021 | 6:51 PM

Shiva Nirvana : టాలీవుడ్‌లో అందమైన ప్రేమకథలకు ఎప్పుడు మంచి ఆదరణే దక్కుతుంది. ఇటీవల వచ్చిన  వైష్ణవ్ తేజ్ ఉప్పెన,  రీసెంట్‌గా నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాల విజయాలే అందుకు నిదర్శనం.. అందుకే కొత్త దర్శకులైన సీనియర్ డైరెక్టర్లైనా ప్రేమకథలను త్తెరకెక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా  త్వరలో ఓ ప్రేమ కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నడని తెలుస్తుంది. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . నేచురల్ స్టార్ నాని హీరోగా టక్ జగదీష్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్‌గా నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు శివ ఓ అందమైన ప్రేమకథను తెరకెక్కించనున్నాడట.. మొదటి రెండు సినిమాలు నిన్నుకోరి, మజిలీలను ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌గా రూపొందించిన శివ నిర్వాణ. ఆతర్వాత టక్ జగదీష్ సినిమాను కమర్షియల్ఎలిమెంట్స్‌తో రూపొందించారు. ఇక ఈ సారి తాను ఒక లవ్ స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్టుగా శివ నిర్వాణ తెలిపారు. ఇందుకోసం వైజాగ్ బీచ్‌లో కూర్చొని కథను సిద్ధం చేస్తున్నారట శివ. సముద్రంలో కెరటాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, తాను రెడీ చేస్తున్న ప్రేమకథ అంతే స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు శివ. మరి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారో చూడాలి. అలాగే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడు శివ. మరి ఈ కథ విజయ్ కోసమా లేక ఇంకెవరైనా ఈ సినిమా చేస్తారా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..