Sharwanand: శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? ఫ్యామిలీతో కలిసి కనక దుర్గమ్మ సేవలో ఛార్మింగ్ స్టార్.. వీడియో

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తన భార్య, కూతురితో కలిసి విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ ఇంద్ర కీలాద్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అలాగే మోపిదేవి సుబ్రహ్మనేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Sharwanand: శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? ఫ్యామిలీతో కలిసి కనక దుర్గమ్మ సేవలో ఛార్మింగ్ స్టార్.. వీడియో
Sharwanand

Updated on: Apr 02, 2025 | 9:26 PM

గతంలో పోల్చితే పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేశాడు శర్వానంద్. గతేడాది అతను నటించిన మనమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ యావరేజ్ గానే నిలిచింది. ప్రస్తుతం నారి నారి నడుమ మురారి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు ఛార్మింగ్ స్టార్. దీంతో పాటు శర్వా చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటోన్న శర్వానంద్ తన ఫ్యామిలీతో కలిసి ఆలయాల సందర్శనకు వెళ్లాడు. మొదట విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న అతను అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం విజయవాడ సమీపంలోని మోపిదేవి సుబ్రహ్మనేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ తన కూతురు లీలాదేవితో ప్రత్యేక పూజలు చేయించి పుట్టు వెంట్రుకలు తీయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు శర్వా కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా 2023 జూన్ లో రక్షితా రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు శర్వానంద్. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా గతేడాది పండంటి ఆడ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టింది. తమ గారాల పట్టీకి లీలా దేవీ మైనేని అని పేరు పెట్టారు శర్వా దంపతులు.

ఇవి కూడా చదవండి

ఆలయాల సందర్శనలో శర్వానంద్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. త్వరలో నారీ నారీ నడుమ మురారి సినిమాతో మన ముందుకు రానున్నడు శర్వానంద్. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర , రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు శర్వా చేతిలో ఉన్నాయి.

శర్వానంద్ కొత్త సినిమా పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి