Sharwanand: మంచి మనసు చాటుకున్న హీరో శర్వానంద్.. కూతురి పేరు మీద ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో

|

Dec 19, 2024 | 8:52 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. ఈ ఏడాది 'మనమే' లాంటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ తో మన ముందుకు వచ్చాడు శర్వా.

Sharwanand: మంచి మనసు చాటుకున్న హీరో శర్వానంద్.. కూతురి పేరు మీద ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో
Sharwanand
Follow us on

స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా క్రేజీ హీరోగా మారిపోయాడు శర్వానంద్. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్లలో శర్వా కూడా ఒకరు. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాఫ్‌లు ఎదురైనప్పటికీ ఒకే ఒక జీవితంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించాడు శర్వా. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గతేడాది జూన్ లో రక్షితా రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు శర్వానంద్. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది పండంటి ఆడ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ శుభవార్తను ఆలస్యంగా చెప్పాడు శర్వా. ఈ ఏడాది మార్చిలో తన పుట్టిన రోజున తనకు కూతురు పుట్టిందన్న గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నాడు. అలాగే తన గారాల పట్టీకి లీలా దేవీ మైనేని అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే సందర్భమేంటో తెలియదు కానీ తన కూతురి పేరు మీద అన్నదానం చేశాడు శర్వానంద్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. శర్వానంద్ తో పాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక శర్వానంద్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. తన 36వ సినిమాకు అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నూ ఓ సినిమా చేస్తున్నాడు. శర్వా 37 (వర్కింగ్ టైటిల్ ) తో పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుత్త హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అన్నదాన కార్యక్రమంలో శర్వానంద్ కుటుంబ సభ్యులు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .