Maha Samudram: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధగా ఉన్నాడు. ఈ సినిమాతోపాటు మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన హిట్ అందుకున్న అజయ్ మరో వినూత్నమైన కథతో మహాసముద్రాన్ని తెరక్కేక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధర్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు. ఆ ద్వేషం కాస్త పెరిగి పెద్ద అయ్యాక పగగా మారుతుంది. దాంతో పాటు ఇద్దరు హీరోలకు అందమైన ప్రేమ కథలు కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తమీద ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Karthikeya 2 : సినిమా టైటిల్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. అప్‌డేట్ మాత్రం ఇవ్వడంలేదు..