AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Naandhi’ movie : కలక్షన్ల పరంగానూ దూసుకుపోతున్న అల్లరోడు.. మూడు రోజులకు ‘నాంది’ ఎంత వాసూలుచేసిందంటే..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

‘Naandhi’ movie : కలక్షన్ల పరంగానూ దూసుకుపోతున్న అల్లరోడు.. మూడు రోజులకు 'నాంది' ఎంత వాసూలుచేసిందంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 3:19 PM

Share

‘Naandhi’ movie : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటించిన సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించాడు. జైలు బ్యాక్ డ్రాప్‏లో సాగిన ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా అల్ల‌రి న‌రేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ప‌లువురు ప్ర‌ముఖులు ఈ చిత్రంపై ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. తాజాగా క్రాక్ చిత్ర డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నాంది చిత్రం ఇప్పుడే చూశాను. చాలా థ్రిల్లింగ్ ఉంది. అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌ట‌న అద్భుతం. ప్రియ‌ద‌ర్శి, హ‌రీష్, ద‌ర్శ‌కుడు విజ‌య్ త‌న ప‌నిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించారు.

కలెక్షన్స్ పరంగా నాంది దూసుకుపోతుంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. మూడో రోజుకు గాను 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటింది ఈ సినిమా. మూడురోజులకు గాను నైజాం- 93 లక్షలు, సీడెడ్- 29 లక్షలు, ఉత్తరాంధ్ర- 19 లక్షలు,ఈస్ట్‌ గోదావరి- 16 లక్షలు, వెస్ట్‌ గోదావరి- 12 లక్షలు, గుంటూరు- 17 లక్షలు, కృష్ణా- 18 లక్షలు, నెల్లూరు- 10 లక్షలు వాసులు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూల్ చేసింది నాంది.  కాగా సుడిగాడు చిత్రం త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌కు నాంది చిత్రం మంచి విజ‌యాన్ని అందించింది. చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చ‌వి చూడడంతో నరేశ్‌ సంతోషంలో మునిగిపోయాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr NTR – Trivikram : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రాయనం రానున్నాడా..? ఫ్యాన్స్ కు పూనకాలే..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!