ఆడాళ్ల గొప్పతనం చెప్పనున్న శర్వా !

|

Oct 20, 2020 | 5:14 PM

‘నేను... శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్‌ తిరుమల. ఆ తర్వాత ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ అనే యూనిట్ సబ్జెక్ట్ చేయాలనుకున్నాడు.

ఆడాళ్ల గొప్పతనం చెప్పనున్న శర్వా !
Follow us on

‘నేను… శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్‌ తిరుమల. ఆ తర్వాత ‘ఆడాళ్లూ… మీకు జోహార్లు’ అనే యూనిట్ సబ్జెక్ట్ చేయాలనుకున్నాడు. సీనియర్ హీరో వెంకటేశ్‌కి కథ చెప్పడం, ఆయన నచ్చి ఓకే చెప్పడం చకచకా జరిగిపోయారు. తమ కలయికలో చిత్రం రూపొందుతోందని వీరిద్దరూ పలు వేదికల్లో చెప్పుకొచ్చారు. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు చిత్రాలు చేస్తూ  కెరీర్ సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ కథతో చిత్రం చేయడానికి కిశోర్‌ తిరుమల రెడీ అయ్యారు. శర్వానంద్‌ హీరోగా ‘ఆడాళ్లూ… మీకు జోహార్లు’ చేయనున్నారని తెలుస్తోంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. జనవరి నెలాఖరు నుంచి షూటింగు ప్రారంభించాలని అనుకుంటున్నారు. తొలుత వెంకటేశ్‌ని హీరోగా అనుకున్నప్పటికీ… శర్వానంద్‌ శైలికి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, సీన్లలో మార్పులు చేశారట.

Also Read :

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !