Mahasamudram : అసలు సినిమా ఎంటనేది ఈ సాంగ్‌లో చూపించేశారు.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Sep 08, 2021 | 1:31 PM

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటుస్తున్నాడు

Mahasamudram : అసలు సినిమా ఎంటనేది ఈ సాంగ్‌లో చూపించేశారు.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sharwanand
Follow us on

Mahasamudram : యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటుస్తున్నాడు. లవ్-ఎమోషన్ -యాక్షన్ ఇలా మిక్స్డ్ ఎమోషన్స్‌‌‌తో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత యంగ్ హీరోలందరూ అజయ్ భూపతి వైపే చూస్తున్నారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు అజయ్.ఇక ఇది మల్టీస్టారర్ సినిమాకావడంతో.. హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు.ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అదితిరావు హైదరీ – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి అందమైన మెలోడీని రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. దీప్తి పార్థసారథి ఆలపించారు. ‘చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. ‘ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే  1.7 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈ సాంగ్ పై హీరో శర్వానంద్ స్పందిస్తూ.. ‘మహాసముద్రం’ సినిమా థీమ్ మొత్తాన్ని తెలియజేస్తుంది. అసలు సినిమా ఎంటనేది ఈ సాంగ్‌లో చూపించారు. ఈ పాట సోల్ ఆఫ్ ది ఫిల్మ్.  వైజాగ్ లో దీన్ని షూట్ చేశాం. ఇది నా ఫేవరేట్ సాంగ్. దీనికి చైతన్ భరద్వాజ్ అమేజింగ్ ట్యూన్ ఇచ్చారు. అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానా.. కొనసాగుతున్న విచారణ.. వీడియో

Viral video : పిల్లను కాపాడుకోవడానికి తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..