‘బేతాళ్‌’ పై కాపీ మ‌ర‌క‌..చిక్కుల్లో షారుక్..

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘బేతాళ్‌’ సిరీస్‌పై వివాదం ముసిరింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ సిరీస్‌ కథకు, తమ మూవీ ‘విటాళ్’ స్టోరీకు పోలికలు ఉన్నాయని స్క్రీన్‌ రైటర్స్‌ సమీర్, మహేశ్ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. “మేం మా కథను అనేక నిర్మాణ సంస్థ‌ల‌ వద్దకు తీసుకెళ్లాం. కానీ రెడ్‌ చిల్లీస్ వారికి ఈ స్టోరీ చెప్పలేదు. మ‌రి ఈ ఐడియా గురించి వారికి ఎలా తెలిసిందో అర్థమ‌వ్వ‌డం […]

బేతాళ్‌ పై కాపీ మ‌ర‌క‌..చిక్కుల్లో షారుక్..

Updated on: May 24, 2020 | 2:44 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘బేతాళ్‌’ సిరీస్‌పై వివాదం ముసిరింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ సిరీస్‌ కథకు, తమ మూవీ ‘విటాళ్’ స్టోరీకు పోలికలు ఉన్నాయని స్క్రీన్‌ రైటర్స్‌ సమీర్, మహేశ్ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు.

“మేం మా కథను అనేక నిర్మాణ సంస్థ‌ల‌ వద్దకు తీసుకెళ్లాం. కానీ రెడ్‌ చిల్లీస్ వారికి ఈ స్టోరీ చెప్పలేదు. మ‌రి ఈ ఐడియా గురించి వారికి ఎలా తెలిసిందో అర్థమ‌వ్వ‌డం లేదు. స్క్రీన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌లో (ఎస్‌డబ్ల్యూఏ) నా స్టోరీ రిజిస్టర్‌ చేసుకున్నా. గతేడాది జులైలో ఓ షోలో చెప్పా. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఏకు కంప్లైంట్ చేశాం. దాదాపు పది సీన్స్ ఒకే మాదిరిగా ఉన్నాయి ” అని వారు చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు షో టెలికాస్ట్ పై స్టే విధించింది.’బేతాళ్’‌ ఫ‌స్ట్ సిరీస్‌ మే 24న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో వినీత్‌ కుమార్‌, అహానా కుమార్‌, జితేంద్ర జోషి సుచిత్ర పిళ్లై లీడ్ రోల్స్ లో న‌టించారు. పాట్రిక్‌ గ్రాహం, నిఖిల్ మహాజన్ ఈ సిరిస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ మూవీ ల‌వర్స్ ను బాగా థ్రిల్ చేసింది.