సుద్దాల అశోక్​తేజకు కాలేయమార్పిడి ట్రీట్మెంట్ సక్సెస్..

ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ప‌రిస్థితి కాస్త ఆందోళ‌నక‌రంగా ఉండ‌టంతో.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి (ఏఐజీ)లో ఆయ‌న‌కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇటీవ‌ల అక్క‌డి డాక్ట‌ర్లు సుద్దాల అశోక్‌తేజ‌కు చేసిన‌ కాలేయ మార్పిడి చికిత్స‌ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన సోద‌రుడు, ప్రభుత్వ వాస్తు సలహదారుడు సుద్దాల సుధాకర్‌తేజ తాజాగా వెల్లడించారు. ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:10 pm, Sun, 24 May 20
సుద్దాల అశోక్​తేజకు కాలేయమార్పిడి ట్రీట్మెంట్ సక్సెస్..

ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ప‌రిస్థితి కాస్త ఆందోళ‌నక‌రంగా ఉండ‌టంతో.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి (ఏఐజీ)లో ఆయ‌న‌కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇటీవ‌ల అక్క‌డి డాక్ట‌ర్లు సుద్దాల అశోక్‌తేజ‌కు చేసిన‌ కాలేయ మార్పిడి చికిత్స‌ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన సోద‌రుడు, ప్రభుత్వ వాస్తు సలహదారుడు సుద్దాల సుధాకర్‌తేజ తాజాగా వెల్లడించారు.

ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి డాక్ట‌ర్లు రాజశేఖర్‌, బాలచందర్‌ నేతృత్వంలో శనివారం మార్నింగ్ 9.30 నుంచి ఈవెనింగ్ 6 గంటల వరకు అశోక్‌తేజకు, ఆయనకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు ఆఫ‌రేష‌న్స్ చేశారన్నారు. ఇవి విజయవంతమయ్యాయని సుద్దాల సుధాకర్‌తేజ పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన తన అన్నయ్య అశోక్‌తేజ తమతో మాట్లాడారని వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్లు విజయవంతంగా పూర్తిచేసిన ఏఐజీ వైద్య బృందానికి, రక్తదానం చేసిన దాతలకు, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు, ఎప్పటికపుడు ప‌రిస్థితి అడిగి తెలుసుకున్న‌సీఎంఓ ఆఫీస్ సిబ్బందికి సుద్దాల‌ సుధాకర్‌తేజ కృతజ్ఞతలు తెలిపారు.