
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22 సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏకంగా 230 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రచ్చ చేశారు. ఇక సాలార్ సినిమాకు పోటీగా రావడానికి మన సినిమాలు సిద్ధంగా లేవు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ను మార్చుకున్నాయి కూడా.. కానీ ఒక్క సినిమా మాత్రం ప్రభాస్ సినిమాతో పోటీ పాడటానికి రెడీ అవుతోంది. ఆ సినిమానే షారుక్ ఖాన్ డంకీ.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవలే జవాన్ సినిమాతో సంచిలన విజయాన్ని అందుకున్నాడు. తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వేయి కోట్లకు పైగా వసూల్ చేసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు డంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు కింగ్ ఖాన్.
ఇప్పటికే డంకీ సినిమాను సలార్ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 22 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు సినిమా సాలార్ కంటే ముందే రిలీజ్ అవుతుందని అంటున్నారు. డంకీ సినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఇప్పుడు డంకీ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక డంకీ తాప్సి, బొమన్ ఇరానీ, దియా మీర్జా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..