Tollywood: సెప్టెంబర్‌లో సినిమాల సందడి.. ఏకంగా ఏడూ పాన్ ఇండియా సినిమాలు

|

Aug 30, 2023 | 6:46 AM

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. నెలకు అరడజను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో కూడా సినిమాల హంగామా కనిపించనుంది. సెప్టెంబర్ నెలలో ఏకంగా ఏడూ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఖుషి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతున్నదంటున్నారు ఫ్యాన్స్.

Tollywood: సెప్టెంబర్‌లో సినిమాల సందడి.. ఏకంగా ఏడూ పాన్ ఇండియా సినిమాలు
Tollywood
Follow us on

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో సినిమాల జాతర కనిపిస్తుంది. ప్రతినెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తూనే.. బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. నెలకు అరడజను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో కూడా సినిమాల హంగామా కనిపించనుంది. సెప్టెంబర్ నెలలో ఏకంగా ఏడూ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఖుషి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతున్నదంటున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జవాన్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అలాగే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటిస్తున్న మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ పోతినేని నటిస్తున్న  ‘స్కంద సినిమా కూడా సెప్టెంబర్ లోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే అదే రోజున విశాల్ నటిస్తున్న సినిమా మార్క్ అంథోని కూడా రిలీజ్ కానుంది. ఇక లారెన్స్ నటిస్తున్న చంద్రముఖి 2 సినిమా కూడా సేమ్ డేట్ న రిలీజ్ కానుంది. సెప్టెంబరు 28న అసలైన పండగ వాతావరణం నెలకొననుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్  సినిమా 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..