దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సుకన్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం వహించిన పుదు నెల్లు పుదు నాథు సినిమాతో రంగప్రవేశం చేసిన సుకన్య.. ఆ తర్వాత కమల్ హాసన్, సత్యరాజ్, విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోలతో నటించింది. విలక్షణ నటుడు జగపతి బాబు నటించిన పెద్దరికం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుకన్య.. ఇక్కడ అంతగా సినిమాల్లో నటించలేదు. ఎక్కువగా తమిళంలోనే ఆఫర్స్ రావడంతో అక్కడే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కొన్నాళ్లపాటు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆమె.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు సినిమాల్లో తల్లిగా, వదిన పాత్రలు పోషిస్తూ సహాయ నటిగా రాణిస్తుంది.
ఈ క్రమంలో కొద్ది రోజులుగా సుకన్య కూతురి గురించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ ఫోటోలో సుకన్యతో కనిపిస్తున్న ఓ అమ్మాయి ఆమె కూతురు అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందిస్తూ.. ఆ ఫోటోలో తనతో ఉన్నది తన కూతురు కాదని.. తన చెల్లెలి కూతురు అంటూ అసలు విషయం బయటపెట్టింది.
సుకన్య మాట్లాడుతూ.. “కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆఫోటోను చేను చూశాను. అందులో నాతో ఉన్నది నా కూతురు కాదు. నా చెల్లెలి కూతురు. ఆ ఫోటోను నా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాను. నేను, నా సోదరి, ఆమె కుమార్తె అని పేర్కొన్నాను. కానీ నా కూతురు అంటు ప్రచారం చేస్తున్నారు. నేను శ్రీధర్ రాజగోపాల్ న పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మేమిద్దరం కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాం. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. డివోర్స్ కోసం చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాతో ఉన్నది నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు. నా గురించి ఏదోక వార్త ప్రచారం చేయడానికే ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. నా చెల్లెలు కూతురు ఈ వార్త చూసి పెద్దమ్మ వల్ల నాకు గుర్తింపు వచ్చిందని అంటుంది” అని చెప్పుకొచ్చింది.
వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.