Tollywood : వెండితెర శ్రీరామ చంద్రులు.. టాలీవుడ్‌లో తొలిసారి రాముడిగా నటించింది ఎవరో తెలుసా..?

|

Apr 17, 2024 | 8:25 AM

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు శ్రీ రాముడు పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన సినిమాల దగ్గర నుంచి మొన్నీమధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.

Tollywood : వెండితెర శ్రీరామ చంద్రులు.. టాలీవుడ్‌లో తొలిసారి రాముడిగా నటించింది ఎవరో తెలుసా..?
Tollywood
Follow us on

నేడు దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీ రామనవమి జరుపుకుంటున్నారు. నేడు దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీ రాముడి కళ్యాణం వైభవంగా జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు శ్రీ రాముడు పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన సినిమాల దగ్గర నుంచి మొన్నీమధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు శ్రీ రాముడి పాత్రలో కనిపించారో ఒక్కసారి చూద్దాం.! తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే ఎన్టీఆరే.. ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు ఎన్టీఆర్.

అసలు టాలీవుడ్ లో తొలిసారి రాముడిగా నటించిన హీరో పేరు యడవల్లి సూర్య నారాయణ. పాదుకా పట్టాభిషేకం సినిమాలో సూర్య నారాయణ రాముడిగా నటించారు. 1932లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీరాముడిగా నటించారు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణం సినిమాతో ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించారు ఎన్టీఆర్.

రాముడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. రాముడు పాత్రలో ఒదిగిపోయి తెలుగువారందరికీ రాముడు అంటే ఎన్టీఆర్ అనేలా ముద్రవేశారు ఎన్టీఆర్. లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్ బాబు రాముడిగా కనిపించారు. ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించారు. అలాగే గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు. నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్‌ కోదండ రాముడిగా నటించారు. అలాగే ‘దేవుళ్లు’ సినిమాలో శ్రీకాంత్ రాముడిగా కొద్దిసేపు రాముడిగా నటించారు. అలాగే శ్రీ రామరాజ్యం సినిమాలో బాలయ్య బాబు కూడా రాముడిగా నటించారు. ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించారు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.