సిస్టర్‌ రోల్స్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్స్.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచిన.. తారలు

|

May 22, 2021 | 9:47 PM

టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ స్టార్ అయ్యింది. సీనియర్ హీరోయిన్లు అత్త, అమ్మల పాత్రల్లో కనిపించటం చాలా రోజులుగా ఉన్న ట్రెండే.

సిస్టర్‌ రోల్స్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్స్.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచిన.. తారలు
Follow us on

టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ స్టార్ అయ్యింది. సీనియర్ హీరోయిన్లు అత్త, అమ్మల పాత్రల్లో కనిపించటం చాలా రోజులుగా ఉన్న ట్రెండే.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సిస్టర్‌ రోల్స్‌కు రెడీ అవుతున్నారు సీనియర్‌ హీరోయిన్స్‌. ఇంకా గ్లామర్ ఇమేజ్‌ ఉన్న బ్యూటీస్‌, లీడ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్న హీరోయిన్స్‌ కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంటే సిస్టర్ రోల్స్‌కు సై అంటున్నారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబుకు అక్కగా సాగరకన్య శిల్పా శెట్టి. త్రివిక్రమ్ సినిమా కోసం ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్ చేస్తున్నారన్న టాక్ చాలా రోజులు వినిపిస్తోంది. సూపర్ స్టార్ సినిమా కావటంతో సిస్టర్‌ రోల్ చేసేందుకు శిల్పా ఓకే చెప్పారన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అంతేకాదు త్రివిక్రమ్ సినిమాలో కీ రోల్స్‌ లో నటించిన లేడీ ఆర్టిస్ట్‌లకు మంచి గుర్తింపు వస్తుండటం కూడా శిల్పా ఓకే చెప్పడానికి ఓ రీజన్‌ అన్న టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య దొంగ సినిమాలో కార్తికి అక్కగా కనిపించిన జ్యోతిక… ఇప్పుడు ప్రభాస్ సిస్టర్ రోల్‌కు ఓకే చెప్పారట. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో జ్యోతిక కూడా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్‌. ఇప్పటికీ హీరోయిన్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న జ్యోతిక… ప్రభాస్ సినిమాలో సిస్టర్‌ రోల్‌కు ఓకే చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఫేడ్ అవుట్ హీరోయిన్స్‌ మాత్రమే కాదు. ఫాంలో ఉన్న హీరోయిన్స్‌ కూడా సిస్టర్ రోల్స్‌కు సై అంటున్నారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కాం నేపథ్యంలో తెరకెక్కిన మోసగాళ్లు సినిమాల్లో సిస్టర్ రోల్ ప్లే చేశారు కాజల్‌ అగర్వాల్‌. యంగ్ హీరో మంచు విష్ణుకు అక్కగా నటించిన కాజల్‌… హీరోయిన్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూనే సిస్టర్‌ క్యారెక్టర్‌ను కూడా జెస్టిఫై చేశారు. ప్రజెంట్ ఫుల్ ఫాంలో ఉన్న కీర్తి సురేష్ కూడా సిస్టర్‌ రోల్‌లో నటించారు. ఒక పక్క టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌కు జోడిగా సర్కారువారి పాట సినిమాలో నటిస్తూనే మరో పక్క తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కి సిస్టర్‌గా నటించారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాల్లో రజనీకాంత్ ముద్దుల చెల్లెలి పాత్రలో నటించారు కీర్తి సురేష్‌. దీపావళి కానుకగా ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు రానుంది.  తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా సిస్టర్‌ రోల్‌కు సై అన్నారు. సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా వరుస సినిమాలు చేస్తున్న నయనతార త్వరలో చెల్లి పాత్రలో నటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసీఫర్‌ రీమేక్‌లో చిరు చెల్లెలిగా కనిపించేందుకు నయన్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కావటం.. పెర్ఫామెన్స్‌కు కూడా చాలా స్కోప్‌ ఉండటంతో నయన్‌ చెల్లి పాత్రకు ఓకే చెప్పారు. ఇలా స్టార్ హీరోయిన్లు కూడా సిస్టర్‌ రోల్స్‌కు ఓకే చెబుతుండటం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Samantha Akkineni: ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడిన స‌మంత‌కు లేనిపోని త‌ల‌నొప్పులు…!

Ananya Nagalla: ఫ్యూచర్ మీద టూ ఫోకస్డ్ గా ఉంటున్న క్యూట్ గర్ల్.. ఆచితూచి అడుగులేస్తున్న అనన్య..

Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్