
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు భారతీయ సినీరంగంలో చక్రం తిప్పిన తోపు హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు..అప్పట్లో స్పెషల్ పాటలతో ఊర్రూతలూగించింది. చాలా కాలం తర్వాత 69 ఏళ్ల వయసులో ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తన పేరు కల్పనా అయ్యర్. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో తన గ్లామరస్ లుక్స్, డ్యాన్స్ తో ఊర్రూతలూగించిన కథానాయిక. ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పాట రంభా హో.. ఈ పాటకు అప్పట్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ సాంగ్ డిమాండ్ మాత్రం తగ్గట్లేదు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
తాజాగా ఓ పెళ్లి వేడుకలో ఈ సూపర్ హిట్ పాటకు సినీయర్ హీరోయిన్ కల్పనా అయ్యర్ అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కల్పనా అయ్యర్. “నిన్న రాత్రి జరిగిన సిద్ధాంత్ పెళ్లి వేడుక ఇది. నేను మళ్లీ ఇలా డ్యాన్స్ చేస్తానని ఊహించలేదు. ఒక స్నేహితుడు ఈ క్లిప్ పంపిస్తే చూసుకున్నాను. నేనేనా ఇలా చేసింది అని నాకే నమ్మకం కలగడం లేదు. చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశాను. ఆ సాయంత్ర నాకు చాలా ప్రత్యేకం” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
ఆ వీడియోలో కల్పనా అయ్యర్ ఊదా రంగు పట్టుచీర కట్టుకుని.. సాంప్రదాయ బ్లాక్ అండ్ గోల్డ్ బ్లౌజ్ లో మెరిశారు. వయసు పెరిగినప్పటికీ కల్పనా అయ్యర్ గ్రేస్ మాత్రం అస్సలు తగ్గలేదని.. అదే ఎనర్జీతో డ్యాన్స్ ఇరగదీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కల్పనా అయ్యర్ అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. 1981లో విడుదలైన అర్మాన్ సినిమాలోని రంభ హో పాటతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కల్పనా.
Kalpana Iyer
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..