Senior Hero Tarun : మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న అలనాటి లవర్ బాయ్

తల్లిదండ్రులు ఇద్దరూ పేరు పొందిన నటులు...వారి నుంచి నటనను వారసత్వంగా తీసుకుని బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. చిన్న వయసులోనే తన నటనతో ఓ రేంజ్ లో...

Senior Hero Tarun : మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న అలనాటి లవర్ బాయ్
Tarun

Updated on: Mar 24, 2021 | 3:11 PM

Senior Hero Tarun : తల్లిదండ్రులు ఇద్దరూ పేరు పొందిన నటులు…వారి నుంచి నటనను వారసత్వంగా తీసుకుని బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. చిన్న వయసులోనే తన నటనతో ఓ రేంజ్ లో ఫేమ్ ను సొంతం చేసుకున్నాడు. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ లో హిట్ అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. అతనే తరుణ్..

రోజారమణి, చక్రపాణిల ముద్దుల తనయుడు తరుణ్ వెండి తెరపై బాలనటుడిగా మెరిశాడు. పదేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరుణ్ .. తెలుగు, తమిళ, మలయాళం అని తేడా లేకుండా బాల నటుడిగా అన్ని భాషల్లో నటించాడు. వెంకటేష్ తో సూర్య ఐపీఎస్, బాలకృష్ణ ఆదిత్య 369లో బాలనటుడిగా అలరించాడు. ఇక నటనలోనే కాదు క్రికెటర్ గా కూడా కొన్నాళ్ళు కెరీర్ ను కొనసాగించాడు.

హీరోగా 2000వ సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాతో అడుగు పెట్టాడు. అప్పట్లో ఈ మూవీ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. తర్వాత నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.. అయితే తరుణ్ సినీ కెరీర్ లో ఎక్కువగా లవ్ స్టోరీలనే చేస్తూ వచ్చాడు. వరస ప్లాప్స్ తో కెరీర్ లో వెనుకబడ్డాడు.. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. తాజగా మళ్లీ తరుణ్ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అందుకే కొత్త తరహా కంటెంట్ లను సెట్ చేసుకుంటున్నాడు. నాలుగేళ్ళ అనంతరం తన ఫ్రెండ్ తోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్నేహితుడు రాసిన కథ తరుణ్ కు బాగా నచ్చిందట. నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఆ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. తరుణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Also Read:  బాహుబలికి మించి ఈ సినిమాకోసం కష్టపడ్డానన్న రానా.. షూటింగ్ కు వారం ముందునుంచే..

వేసవిలో దాహార్తి తీర్చడానికి వచ్చేసింది ఎల్లో పుచ్చకాయ.. ఏవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా..!