Tollywood: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొడుకు.. మరో హీరో దొరికేసినట్టేనా? వీడియో

ఈ హీరోయిన్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. అయితే పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేసింది. అప్పుడప్పుడు మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోంది. కానీ ఇటీవల ఆమె నటించిన ఒక చిన్న సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Tollywood: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొడుకు.. మరో హీరో దొరికేసినట్టేనా? వీడియో
Tollywood Actress Son

Updated on: Jun 07, 2025 | 8:33 AM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఓ సీనియర్ హీరోయిన్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను షేర్ చేసింది. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటోన్న తన కుమారుడి ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయింది. ‘ చిన్ని చిన్ని చేతులతో నువ్వు మా ముందు నిల్చోని ఉన్న రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానుల సదరు హీరోయిన్ ఫ్యామిలీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి పై ఫొటోలో ఉన్న అబ్బాయెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కదు ఒకప్పటి అందాల తార సిమ్రాన్ తనయుడు

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ 2003లో వివాహం చేసుకుంది. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీపక్ ఒక ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఉద్యోగి. అయితే సిమ్రాన్‌తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. సీరియల్స్‌తో పాటు పలు చిన్న బడ్జెట్‌ సినిమాలు నిర్మించారు. సిమ్రాన్- దీపక్ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి తర్వాత సిమ్రాన్ చెన్నైలోనే స్థిరపడిపోయింది. ఇటీవల ఆమె నటించిన టూరిస్ట్ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన సంగతి తెలిసిందే

గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటోన్న సిమ్రాన్ కొడుకు.. వీడియో ఇదిగో.

భర్త, కుమారుడితో నటి సిమ్రాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..