డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ షేక్ చేశాయి. ఇందులోని జమాల్ కుడు సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో వచ్చే ఈ సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇక ఇందులో బాబీ డియోల్ చేసిన డాన్స్ ఆకట్టుకుంది. తలపై మద్యం గ్లాసుతో సింపుల్ గా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బాబీ డియోల్. ఇక ఇదే పాటను నెట్టింట చిన్న, పెద్దా తేడా లేకుండా గ్లాస్ స్టెప్ వేసేందుకు ట్రై చేస్తూ వీడియోస్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ తలపై మద్యం గ్లాసుతో డాన్స్ను 32 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరోయిన్ చేసేసింది. ఇప్పుడు ఆ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి రేఖ. దాదాపు 32 ఏళ్ల క్రితం బివి హో తో ఐసి సినిమాలో ‘సాసు జీ తూనే మేరీ కదర్ నా జానీ’ పాటలో రేఖ ఈ ఐకానిక్ స్టెప్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోలో రేఖ తలపై మద్యం గ్లాసు పెట్టుకుని స్టైలీష్ గా డాన్స్ చేస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అప్పట్లో రేఖ చేసిన డాన్స్.. ఇప్పుడు బాబీ డియోల్ చేసిన డాన్స్ ఒకే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేఖ గ్లాస్ డాన్స్ వీడియోను మీరు చూసేయ్యండి.
ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది. నార్త్ టూ సౌత్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవైపు సినీ ప్రముఖుల నుంచి ఈచిత్రానికి విమర్శలు వచ్చినా.. అడియన్స్ రెస్పాన్స్ ఏ మాత్రం తగ్గలేదు. త్వరలోనే యానిమల్ మూవీ సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.