ఆ ఇద్దరూ ఎంతో సహాయపడ్డారు.. కానీ ఆ హీరో సినిమాతో మొత్తం పోగొట్టుకున్నా.. సుధాకర్ ఎమోషనల్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని కమెడియన్ సుధాకర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించాడు. మెగాస్టార్ చిరంజీవితోపాటే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుధాకర్ 1980 నుంచి తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు .

ఆ ఇద్దరూ ఎంతో సహాయపడ్డారు.. కానీ ఆ హీరో సినిమాతో మొత్తం పోగొట్టుకున్నా.. సుధాకర్ ఎమోషనల్ కామెంట్స్
Comedian Sudhakar

Updated on: Dec 29, 2025 | 12:40 PM

తన నటనతో ప్రేక్షకులను అలరించి, మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సుధాకర్. హీరోగా, కమెడియన్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్. ఒకప్పుడు ఆయన చేసే కామెడి కోసమే సినిమాకు వెళ్లే వారుకూడా లేకపోలేదు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు సుధాకర్. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు సుధాకర్. ప్రస్తుతం ఆయన వయసు మీదపడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలు ఇప్పుడు టీవీలో వస్తే చాలు కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన కామెడీని చాలా మంది ప్రేక్షకులు మిస్ అవుతున్నారు.

గతంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో తన జీవితంలోని వివిధ అంశాలపై, ముఖ్యంగా సినీ నిర్మాతగా తన అనుభవాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటిని సొంతంగా నిర్మించుకున్నానని, తన భార్య అన్ని విషయాలను చూసుకున్నారని తెలిపారు సుధాకర్. నటనకు సంబంధించిన విషయాలు మాత్రమే తాను పట్టించుకునేవాడినని, మిగతావన్నీ ఆమెనే చూసుకునేవారని ఆయన తెలిపారు. డబ్బుపై తనకు పెద్దగా ఆశ ఉండేది కాదని, కేవలం నటనపైనే తనకు ప్యాషన్ ఉందని సుధాకర్ పేర్కొన్నారు.

అప్పట్లో రెమ్యునరేషన్లు చాలా తక్కువగా ఉండేవని, ఇప్పుడు వందలు, వేల కోట్లు అడుగుతున్నారని సుధాకర్ అన్నారు. నిర్మాతగా తన ప్రయాణాన్ని వివరిస్తూ.. యముడికి మొగుడు చిత్రాన్ని నారాయణరావు, హరిప్రసాద్‌లతో కలిసి నిర్మించానని, ఈ సినిమా విజయవంతమై మంచి లాభాలను తెచ్చిపెట్టిందని సుధాకర్ తెలిపారు. ఈ సినిమాకు చిరంజీవి, అల్లు అరవింద్ ఎంతగానో సహకరించారని, మంచి డబ్బు సంపాదించడంలో సహాయపడ్డారని గుర్తు చేసుకున్నారు. అయితే, తర్వాత రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నిర్మించిన పరుగు పరుగు చిత్రం ఆర్థికంగా నష్టాలను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు చిత్రాల అనుభవాలతో, తాను సినీ పరిశ్రమలో సంపాదించిన మొత్తంలో సగానికి పైగా నిర్మాతగా కోల్పోయానని సుధాకర్ తెలిపారు. తన కుమారుడి సినీ కెరీర్ విషయంలో తనకు ఎలాంటి జాగ్రత్తలు లేవని సుధాకర్ అన్నారు. వాడు సొంతంగా అవకాశం వస్తే చేయమని చెప్పానని, కేవలం కృషి, కష్టపడటం మాత్రమే ముఖ్యమని తాను నమ్ముతానని సుధాకర్ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.